Monday, July 5, 2010

‌ గ్రంధి మల్లిఖార్జునరావు , Grandhi MallikharjunaRao

పారిశ్రామికవేత్తగా అవతరించిన మెకానికల్ ఇంజినీర్‌ జిఎంఆర్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ గ్రంధి మల్లిఖార్జునరావు (59) 4.3 బిలియన్‌ డాలర్ల నికర సంపత్తితో జాబితాలో 13వ స్థానాన్ని సంపాదించుకున్నారు.

దేశంలోని వందమంది సంపన్నుల్లో ఏడుగురు తెలుగువారే. ఫోర్బ్స్‌ పత్రిక విడుదల చేసిన అపరకుబేరుల జాబితా ఈ విషయాన్ని వెల్లడించింది. ముఖేష్ అంబానీ, అజీమ్‌ ప్రేమ్‌జీ, లక్ష్మీమిట్టల్‌ సరసన స్థానం సంపాదించిన తెలుగువారిలో జీఎంఆర్‌ గ్రూప్‌ వ్యవస్థాపకులు గ్రంధి మల్లిఖార్జునరావు, ల్యాంకో గ్రూప్‌ అధిపతి లగడపాటి మధుసూధనరావు ఉన్నారు. జీవీకే గ్రూప్‌ సారధి గనుగుపాటి వెంకట కృష్ణారెడ్డి, దివిల్యాబ్స్‌ వ్యవస్థాపకుడు మురళి దివి, రెడ్డి ల్యాబ్స్‌ చైర్మన్‌ కల్లం అంజిరెడ్డిలకూ ఫోర్బ్స్‌ జాబితాలో చోటు దక్కింది. అపోలో హస్పిటల్స్‌ ఫౌండర్‌ ప్రతాప్‌రెడ్డి, అరబిందోఫార్మా అధినేత పీవీ రామ్‌ప్రసాద్‌రెడ్డి పేర్లు కూడా ఈజాబితాలో చేరాయి.
 • పేరు : గ్రంధి మల్లికార్జున రావు
 • చదువు : మెకానికల్ ఇంజినీర్ .
 • జననం : జూలై 14,1950,
 • పుట్టిన ఉరు : రాజాం , శ్రీకాకుళం జిల్లా ,
 • భార్య : వరలక్ష్మి ,
 • పిల్లలు : కుమార్తె - సరిత , అల్లుడు -ప్రశాంత్ బాబు ,
 • తమ్ముడు : గ్రంధి ఈశ్వరరావు ,మరదలు -సరస్వతి ,
 • నివాసం : బెంగళూరు, భారత దేశం
 • వృత్తి : వ్యాపారవేత్త

గ్రంధి మల్లికార్జున రావు లేదా జి.ఎమ్‌.ఆర్. ఒక ప్రముఖ వ్యాపారవేత్త. ఇతను జి.ఎమ్.ఆర్.గ్రూపు అనబడే వ్యాపార సంస్థల సముదాయానికి అధినేత. జి.ఎమ్.ఆర్. వ్యాపార సంస్థలు రోడ్లు, విద్యుత్తు, విమానాశ్రయాలు వంటి మౌలిక సదుపాయాలకు సంబంధించిన వ్యాపారాలలో దేశంలో ఒక ముఖ్య స్థానాన్ని సాధించాయి.. ఇతను 2007 సంవత్ససరం ప్రపంచంలో ధనికుల జాబితాలో 349వ స్థానంలో ఉన్నాడు. ఇతని ఆస్తి 2.6 బిలియన్ డాలర్లగా అంచనా వేశారు.ఫోర్బ్స్ భారత దేశంలో ధనికుల జాబితాలో ఇతను 13వ స్థానంలో ఉన్నాడు.

జీవితం

గ్రంధి మల్లికార్జునరావు జన్మస్థలం శ్రీకాకుళం జిల్లా రాజాం. ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు.


వ్యాపార ప్రస్థానం

మల్లికార్జునరావు 1974లో ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ విభాగంలో చేరాడు. 1976 ఇలా చిన్న ఉద్యోగస్తులు ఎక్కువ డబ్బు సంపాదించలేరని కుటుంబ రీత్యా వస్తున్న జూట్ మిల్లులలో వ్యాపారానికి ఉపక్రమించాడు. చెన్నైలో ఒక పాత జూట్ మిల్లుకొని దానిని పార్టు పార్టులుగా రాజాం తరలించి అక్కడ "వాసవి మిల్స్" అనే ఒక మిల్లును మొదలుపెట్టాడు. 1978లో వరలక్ష్మి మిల్స్ అనే మరొక జూట్ మిల్లును ప్రారంభించాడు. 1983లో ఫెర్రో అల్లాయ్స్ కర్మాగారాన్ని నిర్మించాడు. అప్పుడే "జి.ఎమ్.ఆర్. టెక్నాలజీస్ & ఇండస్ట్రీస్" ప్రాంభమయ్యింది.

1984-85 ప్రాంతంలో వైశ్యా బ్యాంకులో పెట్టుబడులు పెట్టసాగాడు. తన మిత్రుడైన రమేష్ గెల్లి ప్రోద్బలంతో వైశ్యాబ్యాంకు బోర్డు సభ్యుడయ్యాడు. 1991-982లో వైశ్యాబ్యాంకు హక్కుదారుల షేర్లను పెద్దమొత్తంలో కొని ఆ బ్యాంకుకు అతిపెద్ద వాటాదారుడయ్యాడు. 1994లో బ్యాంకునుండి రమేష్ గెల్లి నిష్క్రమించినపుడు మల్లికార్జునరావు తన కార్యకలాపాలను బెంగళూరు, శ్రీకాకుళం - రెండు చోట్లనుండీ నడుపుకోవాల్సివచ్చింది. 1995లో ఒక చక్కెర మిల్లు లైసెన్సు పొంది, దానితోపాటు 16 మెగావాట్ల కో-జెనరేషన్ విద్యుత్‌కర్మాగారాన్ని శ్రీకాకుళంలోని సంకిలి గ్రామము వద్ద మొదలుపెట్టాడు. 1996లో మద్రాసు వద్ద బేసిన్‌బ్రిడ్జి డీసెల్ విద్యుత్కేంద్రం కంట్రాక్టు పొందాడు. 1996-97లో బెంగళూరుకు మారాడు. 1998లో మంగళూరు వద్ద తనీర్ భావి పవర్ ప్రాజెక్టు మొదలయ్యింది. 1998లో మొదలు పెట్టిన బ్రూవరీ బిజినెస్ 2001లో విజయ్ మాల్యాకు చెందిన యు.బి. గ్రూప్‌కు 53 కోట్లకు అమ్మివేశారు.


2002లో తమిళనాడులో ఒకటి, ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి జాతీయ రహదారుల ప్రాజెక్టులు చేజిక్కించుకొన్నారు. 2003లో హైదరాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం వారికి చిక్కింది. 2003లో తన వైశ్యాబ్యాంకు షేర్లను 560 కోట్లకు అమ్మేశాడు. అలాగే 2003లో మొదలుపెట్టిన ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీని 13కోట్ల లాభానికి అమ్మేశాడు. 204లో వేమగిరి విద్యుత్‌కర్మాగారం పని మొదలయ్యింది. ఇది ఈ సంస్థయొక్క మూడవ విద్యుదుత్పాదక కేంద్రం.

2006లో భారత దేశంలో రెండవ పెద్ద విమానాశ్రయం అయిన ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రైవేటీకరణకు కంట్రాక్టును సాధించి జి.ఎమ్.ఆర్. సంస్థ దేశంలో గుర్తింపు పొందింది.. ఈ కాంట్రాక్టు సాధించడానికి తగిన అర్హత కోసం Fraport AG అనే అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడానికి 500 మిలియన్ డాలర్లు వెచ్చించారని అంచనా. ఇదే సంస్థ నిర్మించిన హైదరాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం 2008లో ప్రారంభం అయ్యింది.


Grandhi is one of the Richest persons in the world - 2011

 • ==================================================
Visit my website -> Dr.seshagirirao-MBBS

1 comment:

 1. The entire country, especially Telugus, should be proud of GMR. My earnest hope is that he should do his best for the rapid progress of the new Andhra Pradesh. A thousand salutations to GMR. May God bless him and his ventures.

  ReplyDelete