Tuesday, July 6, 2010

Kurmapu Narasimham , కూర్మాపు నరసింహం





కూర్మాపు నరసింహం మంచి చిత్రకారుడు . కుంచె తో కోటి భావాలు పలికించగల మహా వ్యక్తి . వర్ణ చిత్రాలతో శ్రీకాకుళం జిల్లా కీర్తిని జాతీయ స్థాయిలో ఇనుమడిమ్పజేసిన విశిష్ట ప్రతిభా వంతుడు .

శ్రీకాకుళం పట్నం లో చిన్నబజారు లో ఉన్న నాగేశ్వరరావు ఫోటో స్టుడియోలో ఎన్నో చిత్ర కళా ఖండాలు ఆయన వేసినవే . శ్రీశైలం భ్రమరాంబికాలయం లో నరసింహం గీసిన " ఛత్రపతి శివాజీ కి వీరఖడ్గం అందిస్తున్న బ్రమరంభికాదేవి " చిత్రపటాన్ని తిలకించిన అప్పటి ప్రధాని ' జవహర్ లాల్ నెహ్రూ ' ఈ చిత్ర కారుదుని నేను చూడాలని ఉంది అన్నారంటే నరసింహం భావం ఎంత ఉన్నతమైనదో అవగతము కాగలదు . మల్లెపువుల్లాంటి నేత చీరల్లో అంతుపట్టని హావభావాలతో రంగుదాల్చిన ముగద మనోహరిని ' సుందరమూ గా చిత్రీకరించారు .
మహాత్ముడు దూసి గ్రామానికి వచ్చినప్పుడు గాంధీజీ నిలువెత్తు చిత్రాన్ని గీసి ఇచ్చి ఆయన ప్రశంసలు పొందేరు . కూర్మాపు చిత్రించిన " బుద్దుని క్షీరనివేదనమ్ " బొమ్మను జపాన్ బౌద్ధ అధ్యయన బృందము చూసి ప్రశంసించి నరసింహం చిత్రపటానికి సాష్టాంగ నమస్కారము చేసారు .

జీవిత విసేసాలు :
  • పేరు : కూర్మాపు నరసింహం ,
  • ఊరు : గుల్ల సీతారాంపురము -- సంతకవిటి మండలము .
  • మరణము : 28 - సెప్టెంబర్ 1968 .
  • సోదరుడు : కూర్మాపు బుచ్చిబాబు ,

సేకరణ : డా. వందనా శేషగిరిరావు - శ్రీకాకుళం
  • ============================================
Visit my website -> Dr.seshagirirao-MBBS

2 comments:

  1. మీ అమోఘమైన కృషికి జోహార్లు వందన శేష గిరి రావు గారూ!

    ఢిల్లీ రాజు , గురించి రాస్తారా?
    మీ వ్యాసాలలో వేరే పేరుతో ఉన్నారా?

    ReplyDelete
  2. Kurmapu Narasimham Gari abbai Buchchibabu garu, sodharudu kadu

    ReplyDelete