Monday, August 16, 2010

కె.జె.రావు , K.J.Rao,కొమ్మాజోస్యుల జగన్నాధరావు


ప్రజాస్వామ్యానికి ఎన్నికలే ఆయువు పట్టు . అలాంటి ప్రక్రియలో రాజకీయ నాయకుల అనుచిత ప్రమేయము మొత్తం వ్యవస్థకే శపగ్రస్థం . ఇలాంటి అక్రమార్కుల పాలిట సింహస్వప్నం గా నిలిచిన ఘనత కె.జె.రావు గారిది . బీహార్ లాంటి ప్రమాదకర రాస్ట్రం లో ఎనికల ప్రక్రియను గాడిలో పెట్టిన ధీరుడాయన .

రేగిడి మండలం లోని కె.ఎం.వలస లో 1942 లో పుట్టి అంతర్జాతీయ స్థాయిలో జిల్లా వాణిని వినిపించిన తెలుగు తేజము కె.జె.రావు . ఉద్యోగి గా , రక్షణశాఖలో అడిటర్ గా , ఎన్నికల సంఘంలో చిరుద్యోగిగా ... అదే సంస్థలో కేంద్ర ఎన్నికల ప్రధాన సలహాదారుడు గా , అంతర్జాతీయ ఎన్నికల పరిశీలకుని గా , గల్ఫ్ దేశాలకు ఎంఫోర్సుమెంట్ అధికారిగా , ఐఎఎస్ , ఐపిఎస్ అధికారుల శిక్షణ సభ్యుడిగా , పలు రాస్ట్రాలలో ఎన్నికల పరిశీలకునిగా ... ఇలా అంచెలంచెలుగా ఎదిగి జిలా కీర్తిని ఇనుమడింప జేసిన ఘంత ఆయన సొంతం . ప్రస్తుతము ఫౌండేషన్‌ ఫర్ అడ్వాంస్డ్ మేనేజ్ మెంట్ ఫర్ ఎలక్షన్‌ (ఫేమ్‌) సంస్థకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు . సుఫ్రీం కోర్ట్ ఈయనను ఢిల్లీలో అక్రమ కట్టాడాల నియంత్రణ కమిటీ సభ్యునిగా ఇటేవల నియమించింది .కొమ్మాజోస్యుల జగన్నాధరావు‎  శ్రీకాకుళం జిల్లా లోని కొండలమామిడివలస గ్రామంలో మార్చి 1 1942 న జన్మించారు. ఆయన స్వగ్రామంలో విద్యాభ్యాసం చేశారు. ఆయన విశాఖపట్టణం లోని ఎ.వి.ఎన్.కాలేజీ నందు 1959-62 లో "చరిత్ర" అంశంలో పట్టభద్రుడయ్యాడు.

ఈయన శ్రీకాకుళం జిల్లాలోని "జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మెట్టపల్లి" లో (ప్రస్తుతం ఈ పాఠశాల విజయనగరంలో కలదు) ఆగష్టు 1962 నుండి మార్చి 1963 వరకు అన్‌ట్రైన్డ్ ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఆతర్వాత ఆయన మార్చి 1963 నుండి నవంబరు 1966 వరకు పూనే లోని డిఫెన్స్ ఆడిట్ డిపార్ట్ మెంటు లో ఆడిటరుగా పనిచేశారు.

1965 లో యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ పరీక్ష ఉత్తీర్ణుడయిన తర్వాత ఆయన నవంబరు 14,1966 నుండి ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియాలో సర్వీసులో చేరారు. ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఫిబ్రవరి 28,2002 వరకు ఆయన భారత ఎన్నికల కమీషన్ సెక్రటరీగా పదవీవిరమణ చేయువరకు అనేక బాద్యతలు నిర్వర్తించారు. మార్చి 1,2002 నుండి ఫిబ్రవరి 29,2004 వరకు ఆయన పదవి అనంతరం సేవలు కొనసాగించారు. తర్వాత ఆయన పరిశీలకులు(ఎన్నికలు మరియు శిక్షణ) గా 28 ఫిబ్రవరి, 2006 వరకు యున్నారు.

ఆయన అక్టోబరు 2002 లో జమ్మూ మరియు కాశ్మీర్ లో జరిగిన అతి క్లిష్టమైన సాధారన లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన రాష్ట్రంలోనే ఉండి ప్రతి దశలో ఎన్నికలను నిర్వహించారు. అతను రాష్ట్రంలో ఈ సాధారణ ఎన్నికల అన్ని విషయాలతో సంబంధం కలిగి సక్రమంగా నిర్వహించారు.ఈ ఎన్నికల్లో తన సహకారం భారతదేశం యొక్క ఎన్నికల కమిషన్ ద్వారా అందుకున్నాడు.

ఉద్యోగి గా , రక్షణశాఖలో అడిటర్ గా , ఎన్నికల సంఘంలో చిరుద్యోగిగా ... అదే సంస్థలో కేంద్ర ఎన్నికల ప్రధాన సలహాదారుడు గా , అంతర్జాతీయ ఎన్నికల పరిశీలకుని గా , గల్ఫ్ దేశాలకు ఎంఫోర్సుమెంట్ అధికారిగా , ఐఎఎస్ , ఐపిఎస్ అధికారుల శిక్షణ సభ్యుడిగా , పలు రాస్ట్రాలలో ఎన్నికల పరిశీలకునిగా ... ఇలా అంచెలంచెలుగా ఎదిగి జిలా కీర్తిని ఇనుమడింప జేసిన ఘంత ఆయన సొంతం . ప్రస్తుతము ఫౌండేషన్‌ ఫర్ అడ్వాంస్డ్ మేనేజ్ మెంట్ ఫర్ ఎలక్షన్‌ (ఫేమ్‌) సంస్థకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు . సుఫ్రీం కోర్ట్ ఈయనను ఢిల్లీలో అక్రమ కట్టాడాల నియంత్రణ కమిటీ సభ్యునిగా ఇటేవల నియమించింది .

కె.జె.రావు రాజీవ్ గాంdhi 1989 లో పోటీ చేసిన అమేధీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల అవకతవకలపై యేర్పడిన పరిశీలనా కమిటీలో సభ్యులుగా యున్నారు. 2002 లో ఆయన పదవీవిరమణ చేసినప్పటికీ భారత ఎన్నికల కమిషన్ కు అనేక విధాలుగా సేవలందిస్తున్నారు. ఈయన పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల జాబితాలలో బోగస్ ఓట్లు తొలగించే కార్యక్రమంలో సహకారమందించారు.2009 లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై వచ్చిన అభియోగాలను ఖండించాడు.

  • courtesy with wikipedia.org

  • ========================================
Visit my website -> Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment