Tuesday, August 17, 2010

Kottapalli Punnayya , కొత్తపల్లి పున్నయ్య

కొత్తపల్లి పున్నయ్య న్యాయ రంగం తోపాటు రాజకీయం గా , కవిగా , వివిధ కమిటీల్లో కీలకం గా వ్యవహరించారు . 1923 ఆగస్టు 19 న సోపేట మండలం బారువలో జన్మించిన పున్నయ్య ఇచ్చాపురం , విజయనగరం ప్రాంతాల్లో విద్యాభ్యాసము చేసారు . క్విట్ ఇండియా జాతీయోద్యమం లో పాల్గొన్నారు . 1955 ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి యునైటెడ్ కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలుపొదినారు . అప్పట్లోనే జిల్లాపరిషత్ తొలి వైస్ -చైర్మన్‌ గా పనిచేసి విద్యారంగం అభివృద్ధికి కృషిచేసారు . 1962 లో పొందూరు నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు . చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం లో కులవివక్షతను అంతమొందించడానికి పున్నయ్య కమిషన్‌ ఏర్పాటు చేసారు . భారత ప్రభుత్వము రాజ్యాంగ సమీక్షా సంఘం లో పున్నయ్య ను సభ్యుడి గా నియమించింది
  • =======================================
Visit my website -> Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment