Wednesday, December 29, 2010

Suvvari Sriramamurty , సువ్వారి శ్రీరామమూర్తిఅందరూ నడిచే దారిలో వెళ్ళడం గొప్పవిషయం కాదు . కొత్తదారికోసం అన్వేషించడమే విశేషము . అదృష్టము , పరిస్థితులను నమ్ముకుంటూ కూర్చుంటే జీవితం అక్కడే చప్పగా సాగిపోతుంది . కొత్త అలోచనలు ,కొంగొత్త ప్రణాళికలు ,..అలుపెరగని కృషి , మడమ త్ప్పని పోరాటపటిమతో పనిచేస్తేనే అనుకున్న లక్ష్యము చేరువవుతుంది . లేదంటే కాలగర్భంలోనే మీ కలలన్ని కలిసిపోతాయి.

ప్రతిఏడాది ప్రారంభమ్లో ఈ సంవత్సరం ఏదో ఒకటి సాధించాలని గట్టిగా సంకల్పించడం ... మధ్యలోనే ఏవో కారణాలతో విడిచిపెట్టేయడం ! దాదాపుగా అందరూ చేసేదే. అయితే కొందరు మాత్రం అనుకున్నది సాధిస్తారు ... అందుకోసం ఎంతటి కష్టమైనా ... ఇస్టం గా చేస్తారు . చరిత్రలో నాలుగు కాగితాలు తమకోసం ఉండాలని కోరుకుంటారు . ఇలాంటి వారిలో మన సిక్కోలు వాసి సువ్వారి శ్రీరామమూర్తి ఒకరు .

సాదారణ రైతు కుటుంబం లో పుట్టి ప్రపంచ దేశాలను చుట్టి వస్తున్నారు . జిల్లాలోని పొందూరు మండలం మారుమూల గ్రమమైన " వి.ఆర్.గూడేం" కి చెందిన సువారి శ్రీరామమూర్తి . తాను చదువుకునే రోజుల్లో సాధారణ విద్యార్ధిగానే ఉన్నాడు . ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసము సాగింది . తన తరగతిలో తెలివైన విద్యార్ధుల జాబితాలోనే ఎప్పుడూ ఉండాలని నిరంతరం కష్టపది చదివే వాదు . ఆంధ్రాయూనివర్సిటీలో ఎలక్ట్రానిక్ , టెలికమ్మ్యూనికేషన్‌ లో ఇంజినీరింగ్ పూర్తి చేసి , ఉష్మానియా యూనివర్సిటీలో ఎం.బి.ఎ.పూర్తిచేసారు . డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్‌లోని కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉద్యోగము సంపాదించారు . రీసెర్చ్ అసోసియేట్ రెండున్నర్ యేళ్ళు పనిచేసారు . ఆ వృత్తి తనకి సంతృప్తిని ఇవ్వలేదు . అప్పటిలో సాఫ్ట్ వేర్ రంగానికి ఎంతో ప్రాధాన్యం ఉండడం తో అటువైపు వెళితె ఇంకా మంచి స్థానములో ఉండడనికి వీలుంటుందని ఆలోచనలో పడ్డారు . అదే తన జీవితాన్ని మార్చేసింది . సాఫ్ట్ వేర్ రంగం వైపు వేళారు . ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పర్చేందుకు నిత్య జీవతం లో ఉపయోగపడే విజ్ఞానాన్ని అందించే రంగములో శ్రమించడం ద్వారా సమాజానికి కొంతైనా ఉపయోగపడగలమని భావించి డి.ఆర్.డి.ఒ.ఉద్యోగము వదిలేసి " టి.సి.యస్." లో చేరాడు . అదే తన జీవితం లో టర్నింగ్ పాయింట్ అని ఆయన చెబుతారు . టాటా కన్సెల్టెన్సీ లో అనలిస్టు గా చేరిన శ్రీరామమూర్తి ప్రస్తుతం ఎంగేజ్ మెంట్ మేనేజర్ గా యు.కె.లో పనిచేస్తున్నారు . కష్టపడి . . . కృషి చేస్తే మనిషి ఎంతతి కార్యాన్ని అయినా సాధించగలడు అని నిరూపించారు .
  • ======================================
Visit my website -> Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment