Wednesday, July 6, 2011

Tangudu Krishnarao, తంగుడు కృష్ణారావు


  • పొటొ : ఈనాడు దినపత్రిక సౌజన్యము తో.
కృష్ణారావు శ్రీకాకుళం జిల్లాకి చెందిన గాయకుడు . చిన్ననాటి నుండి పాటే ఆయనకు ప్రాణము . అంచెలంచెలుగా పాటల పల్లకి పై ఆయన ఎదిగారు . మధురమైన తన కంఠస్వరము తో ముగ్ధులను చేస్తున్నారు . మారుమూల గ్రమానికి చెందిన మణిపూస ... రాష్ట్ర స్థాయిలో ప్రముఖుల మన్ననలను అందుకుంటున్నారు .

జలుమూరు మండలము కరవంజ గ్రామానికి చెందిన తంగుడు కృష్ణారావు బి.యస్సీ.వరకు చదువుకున్నారు . నరసన్నపేటలో చదువు కొనసాగించారు . చిరుప్రాయము నుంచి పాటే ప్రాణము గా తరగతి గదుల్లో చిన్నచిన్న స్వరాలతో తనలోని నైపుణ్యాన్ని క్రమముగా మెరుగుపరచుకొని ప్రస్తుతం ప్రముఖ నేపధ్యగాయకుల నడుమ తన పాటల ప్రయాణము సాగిస్తున్నారు . రాష్ట్ర , దేశ వ్యాప్తము గా తన ప్రదర్శనలు ఇచ్చి పరువురి ప్రశంసలు అందుకుంటున్నారు . ఇటీవల కృష్ణారావుకు కోటబొమ్మాళికి చెందిన సౌజన్యతో వివాహము జరిగింది. ఆమెకు కూడా పాటలంటే ఎనలేని మక్కువ .

ప్రముఖులతో కృష్ణారావు :
ప్రముఖ సినీనేపద్య గాయకులు బాలసుబ్రమణ్యం , ఎస్.పి.శైలజ , జి.ఆనంద్ , సునీత , వాసూరావు తదితరుల సంగీత దర్శకత్వములో సినీ పా్టలు పాడి మన్ననలు అందుకుంటున్నారు . ఇప్పటివరకు టి.వి.సీరియల్ లోనూ, పలు సినిమాల్లోనూ కృష్ణారావు పాటలు పాడారు .
టి.వి.సీరియల్ :
జీవన జ్యోతి టైటిల్ సాంగ్ , ,
రాగాల పల్లకి ,
కాలేజ్ డేట్ టు మేరేజ్ డేట్ ,
యువల గీతం ............ మున్నగునవి .

తన ప్రతిభను స్పృత్యంజలి పరిషత్ , తిరుపతి లో జాతీయ స్థాయి కళాకారుల నడుమ నిర్వహించిన నాదనీరాజనం కార్యక్రమము లో తన ప్రతిభను చూపారు . పుట్టపర్తి సత్యసాయి సన్నిధిలో కూడా కృష్ణారావు తన గాత్రాన్ని వినిపించారు . బండారు చిట్టిబాబు వద్ద తన సంగీత అనుభాన్ని సాధించుకొని పలువురి మన్ననలు పొందారు . సప్తస్వరాలు , పాడుతాతీయగా , రాగాల పల్లకి వంటి పోటీల్లో మేటిగా నిలిచిన కృష్ణారావు తాజాగా పలు సినీగేయాలను అలపిస్తున్నారు .

కృష్ణారావు వంశీయులు :
తన తాత తంగుడు సత్యనారాయణ కూడా కళాకారుడే ... ఆయన రంగస్థల నటుడుగా పేరుతెచ్చుకున్నారు . అనంతరము తన తండ్రి రామం .. చంద్రమతి , నక్షత్రక తదితర పాత్రలను వేసి రక్తికట్టింఛేవారు . ఇప్పుడు క్రిష్ణారావు పాటలతో ఆకట్టుకుంటున్నారు .
  • ================================
Visit my website -> Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment