Monday, September 24, 2012

Majji TulasiDas,మజ్జి తులసిదాసు

  •  


మజ్జి తులసీదాసు శ్రీకాకుళం జిల్లాలో సోంపేట నియోజక వర్గానికి చెందిన రాజకీయ నాయకుడు . సొంత గ్రామం పాత్రపురం-సోంపేట మండలం.1972 సోంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ తరుపున MLA గా గెలుపొందేరు. ఈయన 1992 - 94 కాలములో పి.సి.సి. ప్రసిడెంట్ గా తన సేవలు అందించారు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు . పెద్ద కుమార్తె మజ్జి శారద .. మంచి పభుత్వ ఉద్యోగం విడిచి తండ్రి మరణాంతరము రాజకీయ వారసత్వము తీసుకున్నారు. రెండవ కుమార్తె హైదరాబాద్ లో ప్రభుత్వ ఉద్యోగిణి గా స్థిరపడ్డారు .
  •  జిల్లా ప్రముఖల్లో ఒకరైన మజ్జి తులసీదాస్‌ సేవలు విద్యా సంస్థలకు చిరస్మరనీయమని గురజాడ విద్యాసంస్థల అధినేత జి.వి.స్వామినాయడు కొనియాడారు. స్థానిక మునసబుపేట గురజాడ విద్యా సంస్థల ఆవరణలో మజ్జి తులసీదాస్‌ 18వ వర్థంతి సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ఉన్న తులసీదాస్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో జగ్గునాయుడు, డాక్టర్‌ మనోహరి, కళాశాల ప్రిన్సిపాల్‌ పులఖండం శ్రీనివాసరావు, అంబటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. తులసీదాస్‌ సేవలు చిరస్మరణీయం

  • ===========================
Visit my website -> Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment