Friday, February 19, 2010

తంగి సత్యనారాయణ , Tangi Satyanarayana





శ్రీకాకుళం జిల్లా నుండి ఈయనోక్కరే స్పీకర్ గా చేశారు . చాలా మంచి స్వభావము కలవారు . వెలమ కులములో పుట్టి న్యాయవాది గా ఎదిగి రాజకీయాలలో అత్యున్నత పదవి అయిన అసంబ్లీ స్పీకర్ గా ఎన్నికయ్యారు . రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్‌ తంగి సత్యనారాయణ(78) : శ్రీకాకుళం రూరల్‌ మండలంలో కిల్లి పాలెంలో 1931 సెప్టెంబరు 8న జన్మించిన సత్యనారాయణకు భార్య ఆదిలక్ష్మి, నలుగురు కుమార్తెలు, నలుగురు కుమారులు ఉన్నారు. గార సమితికి ప్రప్రథమ అధ్యక్షునిగా 1959-64లో రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన 1967-72 మధ్య స్వతంత్య్ర పార్టీ తరపున శాసనసభ్యునిగా చేశారు.1972లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు, తిరిగి 1983లో రెండోసారి శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికై ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏడాదిన్నర పాటు శాసనసభ స్పీకరుగా వ్యవహరించారు. 1984లో నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నెలరోజుల పాటు రెవెన్యూ శాఖా మంత్రిగా విధులు నిర్వర్తించారు.తిరిగి 1986లో తెలుగుదేశం పార్టీలో చేరారు. మళ్లీ 2008లో తంగి సత్యనారాయణ కాంగ్రెస్‌లో చేరారు. రెండుసార్లు బార్‌ అసోసియేషన్‌కు అధ్యక్షులుగా ఎన్నికైన ఈయన క్రిమినల్‌ లాయర్‌గా జిల్లాలో మంచి ఖ్యాతి నార్జించారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోథులు గౌతు లచ్చన్న, ఎన్‌.జి.రంగాలకు సహచరునిగా రాజకీయాల్లో కొనసాగారు. ఎ.ఐ.సి.సి. సభ్యులుగా కాంగ్రెస్‌ పార్టీ లో కొనసాగేరు .

తంగి సత్యనారాయణ - శ్రీకాకుళంలోని తన నివాసంలో 25 / October /2009 , ఆదివారం ఉదయం కన్నుమూశారు.అన్నవాహికలో ఏర్పడిన క్యాన్సర్‌తో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయనకు హైదరాబాద్‌లో ఇటీవలనే శస్త్రచికిత్సలు కూడా నిర్వహించారు.

  • 02/11/2011 న తంగి విగ్రహాన్ని శ్రీకాకుళం న్యూ బ్రిడ్జి రోడ్ లో ఆవిష్కరించబడినది .
Add by Tangi family in Eenadu Local edition 20121120.
  • =====================================================

Visit my website -> Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment