కోడి రామ్మూర్తి నాయుడు (1882?-1942?) ఆంధ్రరాష్ట్రానికి చెందిన ప్రముఖ వస్తాదు మరియు మల్లయోధులు. ఇరవయ్యో శతాబ్దపు తొలి దశకాల్లో ప్రపంచ ఖ్యాతి గాంచిన తెలుగువారిలో అగ్రగణ్యులు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో జన్మించారు. కోడి వెంకన్న నాయుడు వీరి తండ్రి. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి, తండ్రి ప్రేరణతో విజయనగరంలో తన పినతండ్రి కోడి నారాయణస్వామి దగ్గర పెరిగారు. అక్కడ ఒక వ్యాయమశాలలో చేరి దేహ ధారుడ్యాన్ని పెంచుకోవడంతో పాటు కుస్తీ కూడా నేర్చుకున్నారు. 21 సంవత్సరాల వయసులోనే ఇతడు రొమ్ముపై 1 1/2 టన్నుల భారాన్ని మోసేవాడు. తరువాత 3 టన్నుల భారాన్ని కూడా మోయగలిగాడు. మద్రాసులో సైదాపేట కాలేజిలో ఒక సంవత్సరం వ్యాయామశాలలో శిక్షణ తీసుకుని విజయనగరానికి తిరిగి వచ్చి విజయనగరం ప్రొవిన్షియల్ లోయర్ సెకండరీ పాఠశాలలో వ్యాయమ శిక్షణోపాధ్యాయునిగా పని చేశారు. తరువాత ఒక సర్కస్ సంస్థను స్థాపించి తన బలప్రదర్శనతో దేశ విదేశాలలో ప్రేక్షకులను అబ్బురపరిచారు.మన పురాణాలలో బల శబ్దానికి భీముడు, ఆంజనేయుడు పర్యాయ శబ్దాలైనట్లు ఆంధ్ర ప్రదేశంలో ఇతడి పేరు బలానికి పర్యాయపదంగా పరిగణించబడింది. తన చివరి రోజుల్లో రామ్మూర్తి నాయుడు బలంఘీర్ పాట్నాలో కల్వండే పరగణా ప్రభువు పోషణలో జీవితం గడుపుతూ మరణించారు.
కాలి పై పుట్టిన చిన్న కురుపు పెద్దది ఆపరేషన్ ద్వారా కాలును తొలగించవలసి వచ్చినది . ఆయన ఎన్నో దాన ధర్మాలు చేశారు .1942 జనవరి 13 న భోగిపండుగ నాడు నిద్రలోనే చనిపోయారు .
బలప్రదర్శన విశేషాలు
* గట్టిగా ఊపిరి పీల్చుకుని కండలు బిగించి, తన ఛాతీకి చుట్టిన ఉక్కు తాళ్ళను తెంచేవారు.
* ఛాతీ మీదకు ఏనుగును ఎక్కించుకుని ఐదు నిముషాల పాటు నిలిపేవారు.
* రెండు కార్లను వాటికి కట్టిన తాళ్ళు రెండు చేతులుతో పట్టుకుని కదలకుండా ఆపేవారు.
బిరుదులు
ఆనాటి ఇంగ్లండు పాలకులైన కింగ్ జార్జ్, క్వీన్ మేరీలు రామ్మూర్తి నాయుడి బల ప్రదర్శనకు అబ్బురపడి, 'ఇండియన్ హెర్క్యులెస్' అనే బిరుదును ప్రసాదించారు. ఇంకా కలియుగ భీమ, మల్ల మార్తాండ, జయవీర హనుమాన్, వీరకంఠీరవ వంటి బిరుదులను కూడా సొంతం చేసుకున్నరు.
udate: 18-01-2014
భోగి పండగనాడు చనిపోయిన కోడి రామమూర్తి నాయుడు గారి72 వ వర్ధంతిని తెలగ కుల సంఘం మంగళవారము అనగా 14-01-2014 (ఈ సం.భోగి 14 న చేయడం జరిగినది)తేదీన ఘనం గా నివాళులు అర్పించారు. నాగావళి నది మూడవ వంతెన పై ఉన్న ఆయన విగ్రహnనికి పూల దండలు వేసారు. కోడి రామమూర్తి నాయుడు గారు శ్రీకాకుళం జిల్లా వీరఘట్టాం లో తెలగ కులము లో జన్మించారు.
- ============================
No comments:
Post a Comment