

కాన్వెంట్ బాటను పట్టిన నేటి తరానికి ఆయనెవరో తెలియక పోయినా , ముంజేతిలో చేతికర్ర వేలాద దీసి , బెట్టిన దొర టోపీ పెట్టుకొని ... తెక్కలిని అంతర్జాతీయ సాహితీ ప్రపంచానికి పరిచయం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి రోణంకి అప్పలస్వామి .
అరసం తొలితరం ప్రముఖులు, రాష్ట్రశాఖ అధ్యక్షవర్గ సభ్యులూ అయిన రోణంకి అప్పలస్వామి గారి శతజయంతి ఈ సెప్టెంబరు 15న జరుగనుంది. ఇంగ్లీషు, ఫ్రెంచ్, స్పానిష్, గ్రీక, హిబ్రూ, ఇటాలియన్ మొదలైన ఆరు యురోపియన్ భాషలలో నిష్ణాతులు. శ్రీశ్రీ, ఆరుద్రలకు తొలి రోజుల్లో స్ఫూర్తినిచ్చినవారు. అల్లసానిపెద్దన, భట్టుమూర్తి, క్షేత్రయ్య మొదలు శ్రీశ్రీ, నారాయణబాబు, చావలి బంగారమ్మ, చాసో మొదలైనవారి కవితల్ని ఆంగ్లీకరించి దేశ, విదేశీ భాషా పత్రికల్లో ప్రచురించారు.
అప్పలస్వామిగారు శ్రీకాకుళంజిల్లా టెక్కలి సమీపంలోని ఇజ్జవరం అనే గ్రామంలో 1909 సెప్టెంబరు 15న జన్మించారు. తండ్రి రోణంకి నారాయణ్ , తల్లి - రోణంకి చిట్టెమ్మ . తండ్రి పెట్టిన పాఠశాలలో ప్రాథమిక విద్య ముగించుకుని, విజయనగరం, కాశీ హిందూ విశ్వవిద్యాల యాల్లో చదువుకుని ఎం.ఏ. (ఇంగ్లీషు) పట్టభద్రులయ్యారు. విజయనగరం మహారాజు కళాశాలలో సుమారు 30ఏళ్ళు ఉద్యోగం చేసి - ఇంగ్లీషు శాఖాధిపతిగా 1969లో రిటైరయ్యా రు. మరొక రెండేళ్ళు - ఆంధ్ర విశ్వవిద్యాల యంలో ఎమెరిషస్ ప్రొఫెసర్గా పనిచేశారు. తరువాత టెక్కలిలో స్వగృహం నిర్మించుకుని స్థిరపడ్డారు. 1987 మార్చిలో మరణించారు.
అభ్యుదయ, అవగాహన, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, భారతి, ఆంధ్రప్రదేశ్, కళాకేళి, ప్రజారధం, సృజన మొదలగు పత్రికలలోనూ అనేక ప్రత్యేక సంచికల్లోనూ వ్యాసాలు ప్రచురించారు. సమాచారశాఖ వారికోసం కోడి రామమూర్తిపై చిన్న పుస్తకం రచించారు. కేంద్ర సాహిత్య అకాడమి కోసం మాకియ వెల్లీ ''ప్రిన్స్''ను - నేరుగా ఇటాలియన్ భాషనుండి తెలుగు చేశారు. మానేపల్లి, చిత్రభాను, మోహనప్రసాద్, చాగంటి తులసి - మొ||వారి పుస్తకాలకు ముందుమాటలు రాశారు. ఆరుద్ర తన తొలి కావ్యం -'త్వమేవాహం'నూ మానేపల్లి తన తొలి కవితా సంపుటి 'వెలిగించే దీపాలు'ను గురువుగారికి అంకితం ఇచ్చారు. 1980ల్లో ఆధునిక కవితా పితామహుడు గురజాడ అనీ, శ్రీశ్రీ తానే పితామహుడిననడం తగదని - జరిగిన వాదోపవాదాలకు గట్టి సమాధానం చెప్పారు. విశాఖపట్నం ఆకాశవాణి నుండి తెలుగు, ఇంగ్లీషులలో పలు ప్రసంగాలు చేశారు. రావూరి భరద్వాజగారు - ప్రత్యేకంగా ఆయన చేత హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రాలనుండి ప్రసంగాలు చేయించారు.
టెక్కలి వారి స్వగృహంలో వివిధ యురోపి యన్ భాషలకు చెందిన అరుదైన గ్రంథాలు ఇప్పటికీ అలాగే వున్నాయి. వాటిని విశాఖనగర పౌర గ్రంథాలయానికి తరలించాలన్న ప్రయత్నాలు ఇంకా ఫలించలేదు. ఆయన రచనలు ఎన్నడూ జాగ్రత్త చేయలేదు. పోయినన్ని పోగా మిగిలిన తెలుగు, ఇంగ్లీషు రచనల్ని పుస్తకంగా తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. వారి ఇంగ్లీషు కవితలు లోగడ - సాంగ్స్ అండ్ లిరిక్స(1935), ది నావ్ అండ్ అదర్ పోయమ్స్ (1985) పేర పుస్తక రూపంలో వచ్చాయి.
This comment has been removed by the author.
ReplyDeleteGreat to know of this legendary personality.
ReplyDelete