
సర్దార్ గౌతు లచ్చన్న: ఉత్తర కోస్తా కళింగసీమలో ఉద్దానం ప్రాంతాన (నాటి గంజాం జిల్లా) సోంపేట తాలూకాలో బారువా అనే గ్రామంలో 1909 ఆగష్టు 16 వ తేదీన ఒక సాధారణ బీద సెగిడి కుటుంబములో గౌతు చిట్టయ్య, రాజమ్మ దంపతులకు 8 వ సంతానం గా పుట్టాడు. లచ్చన్న తాత. తండ్రులు సెగిడి కులవృత్తే వారికి కూడుబెట్టేది. ఈతచెట్లను కోత వేసి కల్లు నుత్పత్తి చేయడం, అమ్మడం చుట్టు ప్రక్క గ్రామాల్లో గల కల్లు దుకాణాలకు కల్లు సరఫరా చేయడం వారి వృత్తి. కుల వృత్తిలోకి తమ పిల్లలన్ని దించకుండా చదువులను చెప్పించాలని బారువా లో గల ప్రాధమిక పాఠశాలలో 1916 లో వాళ్ళ నాన్న చిట్టయ్య చేరిపించాడు. లచ్చన్న బారువా ప్రాధమికోన్నత పాఠశాలలో 8 వ తరగతి వరకు చదివి ప్రక్కనే ఉన్న మందసా రాజావారి హైస్కూల్లో 9 వ తరగతి లో చేరాడు. అక్కడ లచ్చన్న చదువు కొనసాగలేదు. దురలవాట్లు, చెడుసహవాసాలు కొనసాగాయి. పలితంగా 9వ తరగతి తప్పాడు. శ్రీకాకుళంలో లచ్చన్నను ఉన్నత పాఠశాలలో చేర్పించారు. అక్కడ జగన్నాధం పంతులుగారి ఇంటిలొ ఉండి చదువుసాగించాడు. ఆ స్కూల్లో డ్రిల్ మాష్టారు నేమాని నరసింహమూర్తి శిక్షణలో జాతీయ భావాల్ని అలవర్చుకున్నాడు. విద్యార్ధి జీవితంలో మార్పు జీవన విధానంలో మార్పు. ఆలోచన ధోరణిలో మార్పు, జాతి , జాతీయత అంటే ఏమిటి ? అనే ప్రాధమిక రాజకీయ పాఠాల్ని నరసింహమూర్తి వద్దనే నేర్చుకోవడం జరిగింది. లచ్చన్నకు ఆనాటికి 21 సవంత్సరాలు . 1929-30 విద్యా సంవత్సరం స్కూల్ పైనల్ పరీక్షకు సెలెక్ట్ కాబడి హజరైనాడు.
పూర్తి వివరాలకోసం -> Sardar Gouthu Latchanna
ఉత్తరాంధ్రలో 'గ్లో' సేవలు విస్తరణ-- సర్దార్ గౌతు లచ్చన్న వర్థంతి సందర్భము గా :
-గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ (గ్లో) ఆధ్వర్యాన ఉత్తరాంధ్రలో మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తరింపజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని సంస్థ కార్యదర్శి యార్లగడ్డ వెంకన్నచౌదరి చెప్పారు. బుధవారం మాజీ మంత్రి గౌతు శివాజీ ఇంటి వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 19న సర్దార్ గౌతు లచ్చన్న 6వ వర్థంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బారువ, సోంపేట, హరిపురంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సర్దార్ ఘాట్‌లో లచ్చన్న దంపతుల విగ్రహాల ఆవిష్కరణ, సోంపేట గాంధీ మండపం వద్ద బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. బారువ కళాశాల బి.సి. విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తామని, లచ్చన్న దీర్ఘకాల సహచరులు బెందాళం రామ్మూర్తినాయుడు, చిన్న నరిసింహమహంతి, అరసవల్లి శివన్నారాయణకు ఘనంగా సన్మానం జరుగుతుందన్నారు. వీటితోపాటు వృద్ధ కళాకారులకు సన్మానం చేసి, ఆర్థికంగా చేయూతనిస్తామని చెప్పారు. రెడ్‌క్రాస్ సొసైటీతో కలిసి రక్తదాన శిబిరం నిర్వహిస్తామని చెప్పారు.శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల పరిధిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వీటిని మరింత విస్తరింపజేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. పలాస మండల పెదంచల గ్రామాన్ని దత్తత తీసుకొని గ్రంథాలయ భవన నిర్మాణంతోపాటు క్రీడల అభివృద్ధికి ప్రోత్సాహం, ఇతర సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. విజయనగరం జిల్లాలో గరుగుబిల్లి మండలం నాగూరు గ్రామాన్ని దత్తత తీసుకొని విద్య, వైద్య, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలో మరో 10 ప్రాంతాల్లో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాలను ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో సోంపేట సర్పంచి వుట్ల గాంధీ, మాజీ సర్పంచి చిత్రాడ సోమేశ్వరరావు, వ్యాపారవేత్త జి.కె.నాయుడు, పాల్గొన్నారు.(సోంపేట, న్యూస్‌టుడే)
======================================================
Visit my website -> Dr.seshagirirao-MBBS
Sardar Gouthu Latchanna is one of my favourite leaders. A man of clear-cut views, commitment, consistency, and values. I heard his speeches during the Jai Andhra Movement. A no-nonsense orator. He sacrificed so much for his political guru, Prof NG Ranga. Whereas Ranga joined the Congress party in a somersault of opportunism, Sardar Latchanna always remained in Opposition - Swatantra Party which later joined the Janata Party. Wish we had such leaders in the present scenario.
ReplyDelete