బొంగు సూర్యనారాయణ టెక్కలి మండలం పిఠాపురం గ్రామానికి చెందిన విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడు. తెలుగు సాహితీలోకం లో తన రచనామృతంతో సాహితీ ప్రియులను మంత్రముగ్ధుల్ని చేయడమేకాకుండా ఆదిత్యుడి(సూర్య దేవుని)సేవలో తరిస్తూ , మూలికా వైద్యంతో ప్రజల రోగాలను నయం చేస్తున్న బహువిద్యాకోవిదుడు . ఈయన రచించిన
- సుప్రభాత సహిత సూర్యశతకం ,
- శ్రీరామక్రిష్ణ యుద్ధం ,
- నవ్యాంధ్ర సుమతీ శతకం ,
- రావివలస ఎండల్ మల్లిఖార్జున స్వామివారి క్షేత్ర మహత్యం ,
- లీలావతార గాధ ,
- వెంకటేశ్వర శతకం ,
- శివక్షేత్ర మహర్యం ,
వంటి పద్యకావ్యాలు పుస్తక రూపం లో విడుదలై ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి .
టెక్కలి బోర్డు హైస్కూల్ లో ఎస్.ఎల్ ఎల్.సి . వరకు చదివిన ఇతడు దూరవిద్యద్వారా ఆంధ్ర విశ్వవిద్యాలయం లో భాషాప్రవీణ కొర్సు పూర్తిచేసారు . చిన్నతనం లో తనతండ్రి నర్సింహం ప్రోత్సాహంతో తెలుగుభాషపై మక్కువ పెంచుకుని తెలుగుభాషకీర్తిని నలుదిసలా విస్తరించాలని నిరంతర కృషి చేస్తున్నారు . ఇందుకోసం టెక్కలి పాతజాతీయ రహదారిపై పౌరాణిక గ్రంధాలయం ఏర్పాటుచేసి పురాతన గ్రంధాలను అందరికీ అందుబాటులో ఉంచారు .
ప్రశంసలు ... పురస్కారాలు :
- 2006 లో విశాఖపట్నం శారదాపీఠం చేపట్టిన కార్యక్రమం లో ఆచార్య సార్వభౌమ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి చే " మధురకవి " బిరుదు ,
- 2006 లో శారదాపీఠం వారిచే " నవ్యాంధ్రకవి " బిరుదు ,
- 2006 లో సాహిత్య బ్రహ్మ వి.వి.ఎల్.నర్షింహరావు హైదరాబాద్ వారి " అపరపింగళసూరన " బిరుదు ,
- 2008 లో కడప లో మహాకవి గడియారం వేంకటశేషశాస్త్రి స్మారక పురస్కారం అందుకున్నారు .
- 2009 లో శ్రీనన్నయభట్టారక పీఠం తణుకు వారి తంగిరాల వెంకటస్వామియాజి పద్యకావ్య్ పురస్కారం తో పాటు " కవిశేఖర " బిరుదు .
///సేకరణ -- డా.శేషగిరిరావు -శ్రీకాకుళం ///
- ==========================================
This comment has been removed by the author.
ReplyDelete