Monday, September 19, 2011

జి.హరీష్ (చిత్రకారుడు), G.Harish (Painter)




పాలకొండ పట్టణంలోని కొండ వీధికి చెందిన చిత్రకారుడు జి.హరీష్‌ తాన చేతి నుంచి జాలువారిన 100కు పైగా చిత్రాలను స్థానిక నవోదయ పాఠశాలలో ఎం.ఎఫ్‌.హుస్సేన్‌ జన్మదినం సందర్భంగా ప్రదర్శించాడు. పలు పాఠశాలల విద్యార్థులు, పట్టణవాసులు ఈ ప్రదర్శనను చూసి మంత్రముగ్దులయ్యారు. వాటర్‌ పెయింటింగ్‌తో హరీష్‌ కుంచె నుంచి జాలువారిన ప్రకృతి సోయగాలు, గిరిజన సంప్రదాయాలు, పల్లె అందాలతో పాటు ప్రదర్శనకు ఉంచిన అన్ని చిత్రాలు చూపరులను కట్టిపడేశాయి.


గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే చిత్రాలు చూస్తుంటే కొత్త అనుభూతి కలుగుతోందని అదనపు జేసీ టి.బాబూరావునాయుడు అన్నారు. పాలకొండలో ఇంత మంచి చిత్రకారుడు ఉన్నాడంటే నమ్మశక్యంగా లేదన్నారు. చిత్రకారుడికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. స్థానిక నవోదయ పాఠశాలలో శనివారం పట్టణానికి చెందిన డిగ్రీ విద్యార్థి హరీష్‌ చిత్రించిన పలు చిత్రాలను ప్రముఖ చిత్రకారుడు ఎం.ఎఫ్‌.హుస్సేన్‌ జన్మదినం సందర్భంగా ప్రదర్శించారు. అదనపు జేసీ ఈ ప్రదర్శనను ప్రారంభించి చిత్రాలను తిలకించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంత మంచి చిత్రాలు మరుగున పడకూడదని, ఎగ్జిబిషన్‌లు, పోటీల్లో ప్రదర్శించాలని సూచించారు. ఢిల్లీలో అంతర్జాతీయ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ను ఓ సారి హరీష్‌ తిలకిస్తే మంచి చిత్రాలు గీసేందుకు స్ఫూర్తి కలుగుతుందన్నారు.


source : Eenadu news paper Srikakulam edition
  • =====================================
Visit my website -> Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment