రచయితగా , నటుడిగా , చిత్రకళోపాధ్యాయునిగా , పసిద్ధ ధ్వనుఅనుకరణ కళాకారునిగా పేరుపొందిన నందికేశ్వరరావు డా.నేరెళ్ళ స్పూర్తితో స్వరమాంత్రికుడి ఏకలవ్య శిష్యునిగా పదిహేనేళ్ళ ప్రాయం లోనే ధ్వనులను అనుకరించడం ప్రారంభించారు . పాతశ్రీకాకుళం లోని తన ఇంటిదరిలోచెట్లపై పొద్దున్నే కిలకిల రావాలు చేసే పక్షుల ధ్వనులను పరిశీలించేవారు . నిరంతర సాధన కృషితో మిమిక్రీ కళాకారునిగా పేరు పొంది ఎందరో శిష్యులను తయారుచేశారు . మిమిక్రీ శ్రీనివాస్ , సూర్యారావు తో పాటు విశాఖపట్నం లోను , ఇతర జిల్లాలలోను ఆయన శిష్యులున్నారు .
అవార్డులు :
- ఉత్తమ మిమిక్రీ కళాకారునిగా ఎనిమిది సార్లు పురస్కారాలు ,
- రాష్ట్ర స్థాయిలో మూడు బంగారు పతకాలు పొందేరు ,
- జిల్లా సాక్షరత సమితి శిబిరం లో సత్కారాలు ,
- గుజరాత్ లొ జరిగిన నెహ్రూ యువకేంద్రం శిక్షణ శిబిరం లో పురస్కారాలు పొందినారు ,
- ఎం.టి.అర్ , అక్కినేని , చిరంజీవి , అల్లు రామలింగయ్య , సుత్తివేలు , కోటా శ్రీనివాసరావు , బ్రహ్మానందం , వంటి స్నినీ ప్రముఖుల చేతులమీదుగా సత్కారాలు అందుకున్నారు .
- మర్రి చెన్నారెడ్డి , పి.వి.నరసింహారావు , జె.వెంగళరావు , చంద్రబాబునాయుడు వంటి రాజకీయ ప్రముఖులు సత్కరించారు .
- ఉత్తమ ఉపాధ్యాయుని గా ప్రభుత్వము సత్కరించినది .
(మూలము : ఈనాడు దినపత్రిక )
- =======================================
No comments:
Post a Comment